ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇవాళ ఉదయం నగరంలో AQI 400పైగా పాయింట్లు నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో సెకండ్ ఫేజ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమల్లో ఉంది. వాయు కాలుష్యం కారణంగా ప్రజల కళ్లల్లో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకురావొద్దని హెచ్చరించారు.