AP: రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నాదెండ్లలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఆయన మాట్లాడారు. కొన్ని చోట్ల బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారని తెలిసిందని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో భూములు రీ సర్వే పేరుతో విస్తీర్ణాలు తగ్గించారని, రీ సర్వేలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.