అమెరికాలో జరగనున్న ఓటర్లను రష్యా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయని ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. ఎన్నికలను రష్యా ఎలా ప్రభావితం చేస్తుందో రెండు ఉదాహరణలతో ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్, ఎన్నికల భద్రతా ఏజెన్సీలు వివరించాయి. యూఎస్ ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు చేశాయి. ఇలాంటి అనుమానాలతో ఎన్నికల అధికారులపై దాడులు జరగొచ్చని అభిప్రాయపడింది.