సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరలు రూ.250 నుంచి రూ.1200కి చేరుకున్నాయి.
KKBJKKJ:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్(Salman Khan)ను రెండేళ్లుగా ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెండేళ్లలో సల్మాన్ నటించిన రెండు సినిమాలు నిర్మాతలకు తేరుకోని నష్టాలను తెచ్చాయి. దాంతో సల్మాన్ కొంచెం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొంచెం గ్యాప్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. సల్మాన్ నటిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్నాయి. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్(EID) సందర్భంగా ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘పఠాన్’విడుదల తర్వాత సల్మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్(Advance Bookings) సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన అభిమానుల కోసం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ తీసుకొచ్చాడు. దాదాపు 4 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ఈద్ రోజున విడుదల కానుంది.
సినిమా అడ్వాన్స్ బుకింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని బట్టి సల్మాన్ ఖాన్ని పెద్ద స్క్రీన్(silver screen)పై చూడటానికి అభిమానులు ఎంతగా ఉత్సుకతతో ఉన్నారో ఊహించవచ్చు. కొన్ని థియేటర్లలో బుకింగ్ ఆదివారం ప్రారంభమవుతుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ అయిన గిట్టి గెలాక్సీలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో సినిమా టిక్కెట్లన్నీ దాదాపు గంటలోపే అమ్ముడయ్యాయి. Gitti Galaxy శనివారం మరియు ఆదివారం షోలకు సంబంధించిన అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. నాలుగు షోలలో మూడు అమ్ముడయ్యాయి. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా టిక్కెట్ల విషయానికొస్తే, ముంబైలోని మల్టీప్లెక్స్(Multiplex)లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా టిక్కెట్లు వారాంతానికి రూ.130 నుండి రూ.600కి చేరుకున్నాయి. ఢిల్లీలో శని, ఆదివారాలు సినిమా టిక్కెట్ ధరలు రూ.250 నుంచి రూ.1200కి చేరుకున్నాయి.
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో పాటు పూజా హెగ్డే(Pooja hegde), షహనాజ్ గిల్, సిద్ధార్థ్ నిగమ్, రాఘవ్ జుయల్, దగ్గుబాటి వెంకటేష్(Venkatesh), జగపతి బాబు(Jagapatibabu), పాలక్ తివారీ, జస్సీ గిల్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ఓ బల్లే బల్లే అంటూ సాగే హుషారైనా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సల్మాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. అంతేకాకుండా ఈ పాటకు థియేటర్లో ప్రేక్షకులు ఈలలు గోలలతో రచ్చ చేయం ఖాయం.