Natural Star Nani : నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్!
Natural Star Nani : న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని అంటున్నారు.
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని అంటున్నారు. ముందుగా దసరా మేకర్స్ తెలుగు రాష్ట్రాల హక్కులను 24 కోట్లకు అమ్మేశారట. కానీ టీజర్ చూసిన తర్వాత.. నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చి మరీ.. దిల్ రాజు సొంతం చేసుకున్నారట. మొత్తంగా దిల్ రాజు 28 కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏరియా వైస్గా దిల్ రాజు గట్టిగానే అందుకున్నాడట. ఇప్పటికే సొంత డిస్ట్రిబ్యూషన్ నైజం మినహా.. 70 శాతం వరకు రికవరీ చేసినట్టు టాక్. మొత్తంగా టీజర్ వచ్చిన తర్వాత.. దసరా లెక్కలు మారిపోయాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టేనని తెలుస్తోంది. దసరా తర్వాత శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో 30వ సినిమా చేస్తున్నాడు నాని. ఇప్పటికే గ్రాండ్గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత.. దర్శకుడు వివేక్ ఆత్రేయకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈయన దర్శకత్వంలో నాని నటించిన ‘అంటే సుందరానికి’ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయినా నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టు సమాచారం. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.