ప్రపంచ కుభేరుల్లో ఒకడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ రోజు అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ రాధికా మర్చంట్ తో ఘనంగా నిర్వహించారు. ఉదయ్ పూర్ లోని ఓ పెద్ద హోటల్ లో వీరి ఎంగేజ్మెంట్ అంగ రంగ వైభవంగా నిర్వహించారు. కాగా…. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో… పెళ్లి నిశ్చయమైంది. కాగా.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా…. అంబానీ కొడలు అనగానే.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటా అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాధికా మర్చెంట్ ఎవరో కాదు. అనంత్ అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్ కుమార్తెనే రాధికా మర్చెంట్. ఆమె తల్లి పేరు శైలా మర్చెంట్ కాగా రాధిక చెల్లెలు అంజలి మర్చంట్. రాధికా న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్ కేర్ బోర్డు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు శాస్త్రీయ నృత్యం అంటే చాలా మక్కువ. ఈ ఇష్టంతోనే భరతనాట్యంలో శిక్షణ పూర్తి చేసుకుంది. జూన్ 5న దేశంలోని పలువురి ప్రముఖులు ముందు ప్రదర్శన ఇచ్చి రాధికా మర్చెంట్ ఆకట్టుకుంది.