భారతదేశంలో కొత్తగా మరొక మంకీ పాక్స్ కేసు నమోడయ్యింది. 38 ఏళ్ళ వ్యక్తి, యూఏఈ నుండి కేరళలోని మలప్పురానికి వచ్చిన తర్వాత మంకీ పాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తన ఫేస్బుక్ పేజీలో ఈ కేసును గురించి సమాచారాన్ని పంచుకున్నారు.
సెప్టెంబర్ 9న భారత్‌లో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదైంది. 1958లో డెన్మార్క్‌లో మంకీ పాక్స్ మొదటగా కోతులలో గుర్తించబడింది. 1970లో మానవుల్లో ఈ వైరస్ మొదటిసారి కనిపించింది. 2022 నుండి ఇప్పటివరకు ఈ వైరస్ 120 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించింది, ఒక లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
అటువంటి పరిస్థుతులలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులు ఈ వైరస్‌ను కచ్చితంగా గుర్తించడానికి మరియు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలలో అవగాహన పెంచడం, మంకీ పాక్స్ లక్షణాలను తెలుసుకోవడం, అవసరమైన సమయంలో వైద్యసహాయం కోరడం అత్యంత కీలకం.
ప్రస్తుతం మంకీ పాక్స్ కాంగో దేశంలో తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతుంది