హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ ప్రాంతానికి చెందిన యువకుడు ప్రవీణ్, కెనడాలో MS చదువుకుంటూ, తన పెద్దన్నయ్య బర్త్డే జరుపుకోవడానికి, టోరంటోలోని లేక్ క్లియర్ వద్ద తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ కు వెళ్లాడు.
స్విమ్మింగ్ చేస్తున్న సందర్భంగా, అనుకోకుండా ప్రవీణ్ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మరియు స్థానికులు వెంటనే సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఈ ఘటన మీర్ పేట్ లో విషాదఛాయలు నెలకొల్పాయి.. ప్రవీణ్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉంది. అతను కెనడా వచ్చినప్పటి నుండి, చదువు., కెరీర్ అభివృద్ధి కోసం కష్టపడుతున్నడని, కానీ ఈ దురదృష్టకర సంఘటన అతని జీవితాన్ని కబళించింది. ప్రవీణ్ మృతితో, ఆయన కుటుంబం, స్నేహితులు శోకసంద్రంలో ఉన్నారు.