కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా దుయ్యబట్టారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని అభివర్ణించారు. అందుచేతనే బీజేపీ నేతలు ఎవ్వరూ నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదని గుర్తుచేశారు.

దేశ ప్రజల మీద నోట్ల రద్దు నిర్ణయం… ఉరుములు లేకుండా పిడుగులు పడినట్టే అయిందని గుర్తుచేశారు. నోట్ల రద్దు తరవాత దేశంలో 500 ,2000 రూపాయల దొంగ నోట్లు పెరిగాయని, దేశంలో చలామణిలో ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లువరించన గణాంకాలు తెలియజేస్తున్నాయని హరీశ్ రావు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో దొంగ నోట్లు 54 శాతం పెరిగాయని RBI నివేదిక తేటతెల్లం చేసిందని హరీశ్ రావు తెలిపారు.
నోట్ల రద్దు తర్వాత దేశంలో వాడుకలో ఉన్న నగదు రెట్టింపయిందని, నోట్ల రద్దు వల్ల 62 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని కూడా హరీశ్ రావు గుర్తుచేశారు. నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు ప్రింటింగ్ కు 21 వేల కోట్లు RBI ఖర్చు చేసిందని హరీశ్ రావు గణాంకాలను వెల్లడించారు.