TG: పాలమూరు బిడ్డకు CM అవకాశం వచ్చిందంటే కురుమూర్తిస్వామి దయతోనే అని CM రేవంత్రెడ్డి అన్నారు. కురుమూర్తిస్వామిని దర్శించుకుంటే తిరుమల వెంకన్నను దర్శించుకున్నట్లే అని పేర్కొన్నారు. కురుమూర్తి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు ఇస్తామని తెలిపారు. దేశంలో ఏ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజల కృషి ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు.