TG: నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24కి విచారణ వాయిదా వేసింది. మోహన్ బాబు పిటిషన్పై జస్టిస్ బి. విజయ్ సేన్రెడ్డి విచారణ జరిపారు. పోలీసులు తనకు నోటీసులు జారీ చేయడంపై మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.