ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు కీలక పిలుపునిచ్చారు. యాంటీపర్సనల్ ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తిని, వినియోగాన్ని నిలిపేయాలని కోరారు. మందుపాతరల కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 5757 మంది మృతి/ గాయపడ్డారని ‘ల్యాండ్‌మైన్ మానిటర్’ నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు. కాగా, ఇటీవల ఉక్రెయిన్‌కు యాంటీపర్సనల్ ల్యాండ్‌మైన్స్‌ను ఇవ్వాలని అమెరికా నిర్ణయించిన విషయం తెలిసిందే.