అలహాబాద్ హైకోర్టు జడ్జ్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు జడ్జ్ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని విచారణ చేపట్టింది. ఆయన చేసిన ప్రసంగంపై సమాచారం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.