AP: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండీలో భారీగా బంగారం, వెండి చోరీకి గురైంది. ఆభరణాల దుకాణాల్లో నిన్నరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాల్లో 100 గ్రాముల బంగారం, 40 కేజీల వెండిని దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు చెప్పారు.