AP: హైకోర్టు అదనపు న్యాయమూర్తులతో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయించారు. అదనపు జడ్జిలుగా జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. జస్టిస్ హరిహరనాథశర్మ స్వస్థలం కర్నూలు జిల్లా కాగా, జస్టిస్ లక్ష్మణరావు ప్రకాశం జిల్లాకు చెందినవారు.