చైనీస్ వీసా కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్‌కు ఊరట లభించింది. ఆయనతో పాటు అభిషేక్ వర్మను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఓ చైనా టెలికాం కంపెనీ అధికారులకు వీసా నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని అభ్యర్థిస్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వారు లేఖ రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ నేత లెటర్‌హెడ్‌తో నకిలీ లేఖను సృష్టించినట్లు సమాచారం.