TG: HYD పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు సర్వాంగ సుందరంగా మారింది. తుది దశకు వచ్చిన అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. దాదాపు రెండు కిలోమీటర్లు ఉండే చెరువు గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ పలు సూచనలు చేశారు. చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నందున వారికి అనువైన వ్యాయామ పరికరాలను సమకూర్చాలన్నారు.