TG: మాజీమంత్రి KTR సంచలన ప్రకటన చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 20 మంది నేత కార్మికులు మరణించారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో తాను MLAగా ఉండటం వల్లనే అక్కడి ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయంటే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.