ప్రపంచంలోని ఎంతో మంది సక్సెస్ఫుల్ వ్యక్తులు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తారు. ఈ సమయంలో పొద్దున్నే లేచి పనులు చేస్తే విజయానికి దారి వేస్తుందని నమ్ముతారు. తెల్లవారుజామున 4:00-4:30 మధ్య కాలాన్ని బ్రాహ్మీముహూర్తంగా పెద్దలు చెప్పారు. ఈ మధ్య కాలంలో నిద్రలేవడం వల్ల మన శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని, శరీరంలో శక్తి ప్రసరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం చేయాలనుకునేవారికి ఈ సమయం అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది.