TG: పసుపు బోర్డు ఏర్పాటుతో తన హామీ పూర్తి కాలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్‌కు ఇంకా చాలా ప్రాజెక్టులు వస్తాయన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెప్పారు. ఎగుమతులు, స్టోరేజ్, మార్కెటింగ్‌తో పాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి పాదాభివందనాలు తెలిపారు.