TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూళ్లు పనిచేస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా స్కూళ్ల టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొననున్నారు.