TG: మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ‘ఇప్పటికే 3 MLC స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్ మధ్య ఉన్న వైరాలే మీ పార్టీ భూస్థాపితానికి ఆరంభం. BRSకు తెలంగాణలో భవిష్యత్తు ఉంటుందనుకోవడం మీ భ్రమ. రాష్ట్రంలో రేపటి రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీదే. బయటకి ఇప్పుడు వచ్చావ్ మళ్లీ ఎప్పుడొస్తావో’ అంటూ ఎద్దేవా చేశారు.