TG: మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి సమీపంలో రూ.110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డికి అర్చకులు, అధికారులు, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. కాగా, చరిత్రలో ఒక సీఎం స్వామివారిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.