న్యూయార్క్‌ను కార్చిచ్చు పొగ కమ్మేస్తోంది. ఇక్కడికి 80 మైళ్ల దూరంలోని అల్స్టర్, సుల్వాన్ కౌంటీల్లో ఇది మొదలైంది. అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. నెల రోజులుగా చుక్క వర్షం లేకపోవడం, మరోవైపు తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. నిన్న సాయంత్రం జెన్నింగ్ క్రీక్ ఫైర్ పుట్టుకొచ్చింది. సుమారు 2 వేల ఎకరాలను దహనం చేసింది.