TG: గోదావరి-బనకచర్ల ద్వారా వరద జలాలను మళ్లించేందుకు ఏపీ చేపట్టిన పథకానికి తాము వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌కు, సి.ఆర్.పాటిల్‌కు ఆయన లేఖ రాశారు. కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.