TG: క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియేషన్ థెరపీకి సంబంధించి అధునాతన యంత్రం హైదరాబాద్లోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి అయిన MNJలో అందుబాటులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ అధునాతన యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రేడియేషన్ థెరపీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు.