TG: హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత, రూ. 18 వేల వేతన హామీ కోసం ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందించారని కొనియాడారు. నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు.