గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయం పూట అల్పాహారంలో భాగంగా కొంతమంది గుడ్లను చేర్చుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో గోధుమ రంగు గుడ్లు ఎక్కువ లభిస్తున్నాయి. తెలుపు కన్నా గోధుమరంగు గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే రెండింటిలోనూ ఒకే రకమైన పోషకాలు ఉంటాయని.. ఏ రంగు గుడ్డు తిన్నా ఒకేలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కోళ్ల మధ్య జన్యుపరమైన తేడాల వల్ల గుడ్డు పెంకు రంగు మారుతుంది.