ప్రభుత్వ కార్యాలయాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులు ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం గురువారం సర్క్యూలర్ జారీ చేసింది. గవర్నమెంట్ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలా తింటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.