జనగాం: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో గురువారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని కాలువలు పూర్తయినంత వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. గండి రామారాం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ప్యాకేజీ6 కింద చేపట్టిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.