ఫార్ములా– ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై కేసు నమోదు, విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 2024 ఫిబ్రవరిలో ఈ-కార్ రేస్ నిర్వహణ కోసం.. RBI అనుమతి లేకుండా విదేశీ మారకం రూపంలో ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు రూ.55 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. కాగా, KTR మంత్రిగా ఉన్నప్పుడు జరగడంతో.. గవర్నర్ అనుమతి తప్పనిసరైంది.