HYD: బీసీ కులగణనను వ్యతిరేకించే పార్టీలు బీసీ ద్రోహులేనని బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైనందున సర్వేలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సురేశ్, మురళీకృష్ణ, పండరినాథ్, సూర్యనారాయణ, జానయ్య, పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.