TG: మహారాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇక్కడి మోసాలు చాలవన్నట్లు అక్కడ కూడా ఇదే తరహాలో కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ చెప్పుకుంటోందని.. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందా?, ఏ రైతుకు అయినా బోనస్ వచ్చిందా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయని విషయాన్ని, రైతుబంధు ఇవ్వలేదని రేవంత్ చెప్పాల్సిందని అన్నారు.