పన్ను వసూలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని IRS శిక్షణ అధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ‘పన్ను వసూలు అంటే కేవలం దేశ ఆదాయాన్ని పెంచటం మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికీ కీలకం. ప్రజలు చెల్లించే పన్నులతోనే దేశాభివృద్ధి సాధ్యం. అంకిత భావంతో పనిచేసి దేశాభివృద్ధికి సాయం అందించాలి. జాతి నిర్మాణంలో IRS అధికారులది కీలక పాత్ర. వ్యవస్థలో పారదర్శకతను పెంచాలి’ అని పేర్కొన్నారు.