AP: CM చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ 500 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. దీంతో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నారు. రూ.65 వేల కోట్లతో డీల్ ఓకే అయినట్లు సమాచారం. గత నెలలో ముకేష్ అంబానీ, అనంత్ అంబానీని మంత్రి లోకేష్ ముంబైలో కలిసి గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీకి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించిన విషయం తెలిసిందే.