TG: స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. అబుల్ కలామ్ దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. దేశ తొలి విద్యా మంత్రి ఆజాద్ జయంతి రోజును స్మరిస్తూ నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.