మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు 16 మంది అభ్యర్థులను కాంగ్రెస్ 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే 16 మంది తిరుగుబాటు అభ్యర్థులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్నేహపూర్వక పోటీ ఉండదని ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితాల వ్యాఖ్యానించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.