బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అయితే ఉదయం పూట బెల్లం నీళ్లు తాగితే మరెన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున బెల్లం నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. ఇందులోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధపపడే వారు ఉదయాన్నే బెల్లం నీరు తాగితే ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.