త్వరలో ప్రధాని మోదీ USలో పర్యటించనున్నారు. అయితే భారత్కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రస్తుతం USలోనే తలదాచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడిపై భారత్లో 104 కేసులు నమోదయ్యాయంటూ పరిస్థితి తీవ్రతను కేంద్రం తెలిపే ప్రయత్నం చేసింది. పంజాబ్, చంఢీగఢ్, HP, హర్యానా, రాజస్థాన్, అసోం రాష్ట్రాల్లోనే పన్నూపై 96 కేసులు ఉన్నట్లు తెలిపింది.