TG: కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అందరిపై ఉందని, కొండపైకి దారి ఏర్పాటుకు రూ.110 కోట్లు కేటాయిస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. కురుమూర్తి అంటే పేదల తిరుపతి అని, జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరులో ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. KCRను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపారని చెప్పారు. కానీ, రెండుసార్లు KCR CM అయినా పరిశ్రమలు రాలేదన్నారు.