క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోయి స్కూల్కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు టీచర్లు అండగా నిలిచారు. నువ్వు ఒంటరివి కాదు… నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నామని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయించుకున్నారు. ఆ చిన్నారికి ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి ప్రపంచం కూడా సలాం చెబుతోంది.