బరువు తగ్గాలనుకునే వారు డైట్ చేస్తుంటారు. అయితే అలాంటివారు తక్కువ కేలరీలు ఉండే బీరకాయ రైస్ సూప్‌ని ఎంచుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత దరిచేరదు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మానికి పోషణను అందించి మెరుపునిస్తాయి.