AP: గుంటూరులో అటవీ అమరవీరుల సంస్మరణ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీశాఖలో తీవ్ర సిబ్బంది కొరత ఉందన్నారు. విధి నిర్వహణలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అటవీ అమరవీరుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. అడవులను రక్షించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. అటవీశాఖకు సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు. వివిధ వర్గాల నుంచి సేకరించి అటవీశాఖకు రూ.5 కోట్ల విరాళమిస్తామని చెప్పారు.