AP: విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై CM చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం సమావేశమై చర్చించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం నీతిఆయోగ్ సీఈఓకు వివరించారు.