AP: మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లో సిట్ బృందం తనిఖీలు చేపట్టింది. మద్యం కేసు విచారణను సిట్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం పాలసీపై సంతకాలు చేశారని సిట్ అభిప్రాయపడింది. నూతన మద్యం పాలసీ సమయంలో ఎక్సెైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.