TG: ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమ సమయంలో అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మాజీమంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. “అగ్నికి ఆహుతవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణిచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులు. జోహార్ శ్రీకాంతాచారి” అంటూ ట్వీట్ చేశారు.