మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 14 మందితో కూడిన కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాతో మహా వికాస్ అఘాడి కూటమిలో భాగమైన కాంగ్రెస్ 99 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత వారం 16 మందితో కూడిన జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, తాజా జాబితాలో అంధేరి(వెస్ట్) నియోజకవర్గం నుంచి సచిన్ సావంత్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్‌కు చోటు దక్కింది.