బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచారు. తాజాగా ఆమె పార్టీ అవామీ లీగ్ నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేస్తుందట. ఢాకాలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించనున్నారట. హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాలో మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.