ముస్లింలకు రిజర్వేషన్ల డిమాండ్‌కు మహా వికాస్ అఘాడి(MVA) కూటమిలోని ప్రతి పార్టీ మద్దతు ఇస్తుందని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ధన్గర్, ముస్లింలు, మరాఠాలు, లింగాయత్‌లు, భట్కే విముక్త్ సమాజ్లకు రిజర్వేషన్లు కల్పించాలని.. గత పదేళ్లుగా పార్లమెంట్లో చెబుతున్నానని సూలే తెలిపారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.