హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది. అండాశయ, రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు దరిచేరవు. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల ఆరోగ్యానికి ఉపయోగకరం. ఈస్ట్రోజన్ ఉత్పత్తి, నెలసరి క్రమం తప్పకుండా ఉండటానికి సహకరిస్తాయి.